27, జూన్ 2020, శనివారం

ఐశ్వర్యములకు ని-న్ననుసరింపగలేదు

సీ॥
ఐశ్వర్యములకు ని-న్ననుసరింపగలేదు
ద్రవ్యమిమ్మని వెంటఁ-దగులలేదు
కనక మిమ్మని చాలఁ-గష్టపెట్టగలేదు
పల్లకిమ్మని నోటఁ-పలుకలేదు
సొమ్ములిమ్మని నిన్ను-నమ్మి కొల్వఁగలేదు
భూములిమ్మని పేరు-పొగడలేదు
బలము నిమ్మని నిన్ను-బ్రతిమాలగాలేదు
పశులనిమ్మని పట్టు-పట్టలేదు
తే॥
నేను గోరిన దొక్కటే-నీలవర్ణ
చయ్యనను మోక్ష మిచ్చినఁ-జాలు నాకు
భూషణవికాస!శ్రీధర్మ-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!

26, జూన్ 2020, శుక్రవారం

ఆది నారాయణా-యనుచు నాలుకతోడఁ

సీ.
ఆదినారాయణా-యనుచు నాలుకతోడఁ
బలుక నేర్చినవారి-పాదములకు
సాష్టాంగముగ నమస్కార-మర్పణ జేఁసి
ప్రస్తుతించెదనయ్య-బహువిధముల
ధరణిలో నరులెంత-దండివారైనను
నిన్నుఁగాననివారి-నే స్మరింప
మేము శ్రేష్టులమంచు-మిడుకుచుండెడివారి
చెంతఁ జేరఁగబోను-శేషశయన
తే॥
పరమ సాత్త్వికులైన నీ- భక్తవరుల
దాసులకు దాసుఁడను సుమీ-ధరణిలోన
భూషణవికాస!శ్రీధర్మ-పురవివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!

25, జూన్ 2020, గురువారం

నరసింహ!నీ దివ్య-నామ మంత్రముచేత

నరసింహ!నీ దివ్య-నామ మంత్రము చేత
దురిత జాలము లెల్ల-ద్రోలవచ్చు
నరసింహ!నీ దివ్య-నామ మంత్రము చేత
బలుపైన రోగముల్-బాపవచ్చు
నరసింహ!నీ దివ్య-నామ మంత్రము చేత
రిపు సంఘముల సంహ-రింపవచ్చు
నరసింహ!నీ దివ్య-నామ మంత్రము చేత
దండహస్తుని బంట్ల-దఱుమవచ్చు
తే॥
భళిర!నే నీ మహామంత్ర-బలము చేత
దివ్య వైకుంఠ పదవి సా-ధింపవచ్చు
భూషణవికాస!శ్రీధర్మ-పుర నివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!

24, జూన్ 2020, బుధవారం

పద్మలోచన!సీస పద్యముల్ నీ మీఁద

పద్మలోచన!సీసపద్యముల్ నీమీఁద
జెప్పఁబూనితినయ్య,చిత్తగింపు
గణ యతి ప్రాస లక్షణముఁ జూడఁను లేదు
పంచకావ్య శ్లోకపఠన లేదు
అమరకాండత్రయం బరసి చూడఁగలేదు
శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు
నీ కటాక్షంబున నే రచించితిఁగాని
ప్రజ్ఞ నాయదిగాదు ప్రస్తుతింపఁ
తే॥
తప్పుపడ నేమి సద్భక్తి తక్కువౌనె?
చెఱకునకు వంక పోనేమి-చెడునె తీపి
భూషణవికాస!శ్రీధర్మ-పుర నివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!

23, జూన్ 2020, మంగళవారం

శ్రీ మనోహర!సురా-ర్చిత!సింధుగంభీర!

శ్రీ మనోహర!సురా-ర్చిత!సింధుగంభీర! భక్తవత్సల!కోటి-భానుతేజ! కంజనేత్ర!హిరణ్య-కశ్యపాంతక శూర! సాధురక్షణ!శంఖ-చక్రహస్త! ప్రహ్లాదవరద!పా-పధ్వంశ!సర్వేశ! క్షీరసాగరశయన!-కృష్ణవర్ణ! పక్షివాహన!నీల-భ్రమరకుంతలజాల! పల్లవారుణ పాద-పద్మ యుగళ! తే॥చారు శ్రీ చందనాగురు-చర్చితాంగ! కుందకుట్మలదంత!వై-కుంఠ ధామ! భూషణవికాస!శ్రీధర్మ-పురనివాస! దుష్టసంహార!నరసింహ!-దురితదూర!

14, డిసెంబర్ 2013, శనివారం

seshappayanukavi

seshappayanukavi--cheppina padyamul chevula kaanadamai--chelaguchundu ne manujundaina--nelami nee sathakamu bhakthithovinna--sathphalamu galugu jelagi ee padyamul--cherchi vraasinavaaru kamalaalshu karunanu---gaanthurepudu nimpugaa busthakam---bepudu boojinchina durithajaalambulu--dolagipovu// niddi punyaakaram bani...yepudu janulu kashtamanaka patinchinan..galugu mukthi bhooshanavikaasa1sreedharma...puranivaasa! dushtasamhaara1narasimha!durithadoora1//100// ide ee sathakaaniki thudi paluku laanti padyamu.O Narasimha!Seshappa kavi ane athanu raasina ee sathakamu loni padyaalu chevulaku impugaa,vinabuddhi avuthaayi.yevarainaa ee sathakaanni bhakthitho chadivithe manchi phalithaalu dakkuthaayi.ee sathakaanni preethitho,ishtangaa koorchi vraasthe sree mahaa vishnuvu krupanu yellappudu ponduthaaru.ee sathakaanni manchigaa poojisthe baadhalu anni tholagipothaayi.punya daayakamayina ee sathakamu yeppudu chadivinaa ,yellappudu chadivinaa mukthi,moksham kaluguthaayi. sarve janaah sukhino bhavanthi!!!!!

amarendra vinutha

amarendra vinutha!ni--nnanusarinchina vaaru mukthibondiri vega---mudamu thoda nee paadapadmamul--neranammiyunnaanu naaku mokshambimmu---nalina nethra kaachi rakshinchunan--gadatherchu begame nee sevakuni jeyu---nischayamuga gaapaadinanu neeku---gainkaryaparudanai chelagi nee panulanu---jeyuvaada/ nanuchu balumaaruvededa---nabjanaabha! naaku brathyakshamigu ninne...namminaanu bhooshanavikaasa!sreedharma--puranivaasa! dushtasamhaara!narasimha!durithadoora!//99// kavi narasimhudini ilaa vedukuntunnaadu. swamy!amarendrudaina devendrunichetha pogadabadina vaadivi,nuvvu.ninnu nammukunna vaallanthaa mukthini pondaaru,chaalaa vegamgaa.nenu koodaa aanandangaa ninne nammukoni vunnaanu.nalinadalanethra!naaku koodaa moksham prasaadinchu.nannu rakshinchu. nannu ee eethi baadhalanunchi kada therchu.nannu nee sevakudini chesuko.nannu thappanisarigaa kaapaadaalsina baadhyatha neede.nannu nenu neeku samarpinchukonabadina vaadanu kaabatti,nee panulanni aanandangaa chesthaanu. ninnu praardhinchedaaniki naaku yemilimitations levu. yenni saarlainaa vedukuntaanu.naaku saakshaathkarinchi,naaku darsana bhaagyam ivvu ,swamy. O Narasimha!ninne nammukoni vunnaanu.