శ్రీ మనోహర!సురా-ర్చిత!సింధుగంభీర!
భక్తవత్సల!కోటి-భానుతేజ!
కంజనేత్ర!హిరణ్య-కశ్యపాంతక శూర!
సాధురక్షణ!శంఖ-చక్రహస్త!
ప్రహ్లాదవరద!పా-పధ్వంశ!సర్వేశ!
క్షీరసాగరశయన!-కృష్ణవర్ణ!
పక్షివాహన!నీల-భ్రమరకుంతలజాల!
పల్లవారుణ పాద-పద్మ యుగళ!
తే॥చారు శ్రీ చందనాగురు-చర్చితాంగ!
కుందకుట్మలదంత!వై-కుంఠ ధామ!
భూషణవికాస!శ్రీధర్మ-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి