29, జూన్ 2020, సోమవారం

మందుడనని నన్ను-నింద జేసిన నేమి?

సీ॥
మందుడనని నన్ను-నింద జేసిన నేమి?
నా దీనతను జూచి-నవ్వనేమి?
దూరభావము లేక- తూలనాడిన నేమి?
ప్రీతి సేయక వంకఁ-బెట్టనేమి?
కక్కసంబులు పల్కి-వెక్కిరించిన నేమి?
తీవ్రకోపము చేత-దిట్టనేమి?
హెచ్చుమాటల చేత-నెమ్మలాడిన నేమి?
చేరి దాపట గేలి-సేయనేమి?
తే॥
కల్పవృక్షము వలె నీవు-గల్గ నింకఁ
బ్రజల లక్ష్యంబు నాకేల-పద్మనాభ!
భూషణవికాస!శ్రీధర్మ-పుర నివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి