తల్లి గర్భమునుండి- ధనము తేఁ డెవ్వఁడు
వెళ్ళిపోయెడినాడు-వెంటరాదు
లక్షాధికారైన-లవణ మన్నమె కాని
మెఱుఁగు బంగారంబు-మ్రింగబోఁడు
విత్తమార్జనఁజేసి-విఱ్ఱవీఁగుటె కాని
కూడ బెట్టిన సొమ్ము-కుడువబోఁడు
పొందుగా మఱుగైన-భూమిలోపలఁబెట్టి
దానధర్మము లేక-దాఁచి దాఁచి
తే॥
తుదకు దొంగల కిత్తురో-దొరల కవునొ
తేనె జుంటీగ లియ్యవా-తెరువరులకు!
భూషణవికాస!శ్రీధర్మ!-పురవివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి