21, జులై 2020, మంగళవారం

నీల మేఘశ్యామ!-నీవె తండ్రివి మాకు

సీ॥
నీలమేఘశ్యామ!-నీవె తండ్రివి మాకు
కమలవాసిని మమ్ము-గన్నతల్లి
నీ భక్తవరులంత-నిజమైన బాంధవుల్
నీ కటాక్షము మా క-నేక ధనము
నీ కీర్తనల్ మాకు-లోక ప్రపంచంబు
నీ సహాయము మాకు-నిత్య సుఖము
నీ మంత్రమే మాకు-నిష్కళంకపు విద్య
నీ పద ధ్యానంబు-నిత్య జపము
తే॥
తోయజాతాక్ష!నీ పాద-తులసి దళము
రోగముల కౌషధము బ్రహ్మ రుద్ర వినుత
భూషణవికాస! శ్రీధర్మ-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి