29, జులై 2020, బుధవారం

అతిశయంబుగఁ కల్ల-లాడనేర్చితిఁ గాని

సీ॥
అతిశయంబుగఁ కల్ల-లాడనేర్చితిఁ గాని
పాటిగా సత్యముల్-పలికి యెరుగ
సత్కార్య విఘ్నముల్-సలుప నేర్చితిఁ గాని
యిష్ట మొందగ-నిర్వహింప నేర
ఒకరి సొమ్ముకు దోసి లొగ్గ- నేర్చితిఁ గాని
చెలువుగా ధర్మంబు-సేయనేర
ధనము లియ్యంగ వ-ద్దనగ నేర్చితిఁ గాని
శీఘ్ర మిచ్చెడునట్లు-చెప్పనేరఁ
తే॥
పంకజాతాక్ష!నేనెంత-పాతకుడను!
దప్పులన్నియు క్షమియింప-దండ్రి నీవె
భూషణవికాస! శ్రీధర్మ!-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి