తనువులోఁ బ్రాణముల్-తరలి పోయెడి వేళ
నీ స్వరూపమును ధ్యా-నించు నతఁడు
నిమిషమాత్రము లోన-నిన్ను జేరును కాని
యముని చేతికి జిక్కి-శ్రమల బడఁడు
పరమ సంతోషాన-భజనఁ చేసెడి వారి
పుణ్య మేమనవచ్చు-భోగిశయన!
మోక్షము నీ దాస- ముఖ్యుల కగుఁగాని
నరక మెక్కడిదయ్య-నళిన నేత్ర!
తే॥
కమలనాభ!నీ మహిమ-గానలేని
తుచ్ఛులకు ముక్తి దొరకుట -దుర్లభంబు
భూషణవికాస !శ్రీధర్మ!-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి