19, జులై 2020, ఆదివారం

లోకమందెవడైన -లోభి మానవుఁడున్న

సీ॥
లోకమందెవడైన - లోభి మానవుఁడున్న
భిక్ష మర్ధికి జేతఁ-బెట్టలేడు
తాను బెట్టకయున్న-దగవు పుట్టదు గాని
యొరులు పెట్టఁగ జూచి-యోర్వలేడు
దాత దగ్గఱఁజేరి- తన ముల్లె చెడునట్లు
జిహ్వతోఁ జాడీలు-చెప్పుచుండు
ఫలము విఘ్నంబైన-బలు సంతసమునందు
మేలు కల్గినఁ జాల-మిడుకుచుండు
తే॥
శ్రీరమానాథఁ యిటువంటి-కృూరునకును
భిక్షకుల శత్రువని పేరు-పెట్టవచ్చు
భూషణవికాస !శ్రీధర్మ-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి