ఇభరాజవరద!ని-న్నెంత పిల్చినఁగాని
మాఱుపల్కవ దేమి-మౌని తనము?
మునిజనార్చిత-నిన్ను-మ్రొక్కి వేఁడినఁగాని
కనులఁ బడవదేమి-గడుసుదనము?
చాల దైన్యమునొంది-చాటు జొచ్చినఁగాని
భాగ్యమియ్య వదేమి-ప్రౌఢితనము?
స్థిరముగా నీ పాదసేవఁ -జేసెదనన్న
దొరకఁజాల వదేమి-ధూర్తతనము?
తే॥
మోక్షదాయక!ఇటువంటి-మూర్ఖజనుని
కష్టపెట్టిన నీకేమి-కడుపునిండు?
భూషణవికాస!శ్రీధర్మ!-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!దురితదూర!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి