25, జులై 2020, శనివారం

తల్లితండ్రులు భార్య-తనయు లాప్తులు బావ

సీ॥
తల్లిదండ్రులు భార్య-తనయు లాప్తులు బావ
మఱుదులన్నలు మేన-మామగారు
ఘనముగా బంధువుల్-గల్గినప్పటికైన
దాను దర్లగ వెంటఁ-దగిలి రారు
యమునిదూతలు ప్రాణ- మపహరించుక పోఁవ
మమతతోఁ బోరాడి-మాన్పలేరు
బలగ మందఱు దుఃఖ-పడుట మాత్రమె కాని
యించుక నాయుష్య-మివ్వలేరు
తే॥
చుట్టములమీఁది భ్రమదీసి- చూరబెట్టి
సంతతము మిమ్మునమ్ముట-సార్థకంబు
భూషణవికాస! శ్రీధర్మ!-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి