22, జులై 2020, బుధవారం

బ్రతికినన్నాళ్ళు నీ -భజన తప్పను గాని

సీ॥
బ్రతికినన్నాళ్ళు నీ-భజన తప్పను గాని
మరణకాలము నందు మఱుతునేమొ!
ఆవేళ యమదూత-లాగ్రహంబున వచ్చి
ప్రాణముల్ పెకలించి-పట్టునపుడు
కఫవాత పైత్యముల్-గప్పగాఁ భ్రమచేత
గంపముద్భవముంది-కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను-నారాయణా యంచు
బిలుతునో,శ్రమచేతఁ-బిలువలేనొ!
తే॥
నాఁటికిప్పుడె భక్తి నీ-నామ భజన
తలఁచెదను జెవిని వినవయ్య-ధైర్యముగను
భూషణవికాస!శ్రీధర్మ-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి