27, జులై 2020, సోమవారం

నీమీద కీర్తనల్-నిత్య గానముఁ జేసి

సీ॥
నీ మీద కీర్తనల్-నిత్య గానముఁ జేసి
రమ్యమొందింప నా-రదుఁడఁగాను
సావధానముగ నీ-చరణ పంకజ సేవ
సలిపి మెప్పింపంగ-శబరిఁ గాను
బాల్య మప్పటినుండి-భక్తి నీయందున
గలగగ బ్రహ్లాద-ఘనుఁడగాను
ఘనముగా నీమీఁద-గ్రంథముల్ గల్పించి
వినుతి సేయను వ్యాస-మునిని గాను
తే॥
సాధుఁడను,మూర్ఖమతి,మను-ష్యాధముడను,
హీనుడను సుమ్మి నీవు న-న్నేలుకొనుము!
భూషణవికాస!శ్రీథర్మ!-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి