సీ||
గార్ధభంబున కేల- కస్తూరి తిలకంబు
మర్కటంబున కేల-మలయజంబు
శార్దూలముల కేల-శర్కరాపూపంబు
సూకరంబున కేల-చూతఫలము
మార్జాలమున కేల- మల్లెపువ్వుల బంతి
గుడ్లగూబకు నేల-కుండలములు
మహిషంబున కేల- నిర్మల వస్త్రముల్
బక సంతతికి నేల-పంజరంబు
తే॥
ద్రోహచింతన జేసెడు-దుర్జనులకు
మధురమైనట్టి నీ నామ-మంత్రమేల
భూషణవికాస!శ్రీధర్మ-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి